అశ్విన్ తో విభేదాలున్నాయి.. కానీ..!
posted on Jun 8, 2017 11:54AM

ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్ లల్లో స్విన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అలాంటి అశ్విన్ కు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచుల్లో మాత్రం ఇండియా జట్టులో చోటు దక్కలేదు. ఇక దీనిపై వస్తున్న వార్తలపై స్పందించిన కోహ్లీ.. అశ్విన్ కు స్ఠానం దక్కకపోవడం జీర్ణించుకోవడం ఎవరికైనా కష్టమేనని, కానీ జట్టుకూర్పు సమీకరణాలను అశ్విన్ అర్థం చేసుకోగలడని అన్నాడు. ‘అశ్విన్ టాప్ క్లాస్ బౌలర్. అది అందరికీ తెలిసిన విషయం. అతను చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాడు. గత మ్యాచ్ సంబంధించిన జట్టుకూర్పును అతను బాగా అర్థం చేసుకున్నాడు. దీనిపై అతనికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. నువ్వుం ఏం చేసినా నేను అండగా ఉంటానని అతను నాతో చెప్పాడు. మా మధ్య ఉన్న అనుబంధం అది’ అని కోహ్లి వివరించాడు. ఇంకా వీరిద్దరి మధ్య ఉన్న విభేదాల గురించి కూడా కోహ్లీ మాట్లాడుతూ... మా మధ్య విబేధాలు ఉన్న సంగతి వాస్తవమే.. కానీ అవి వ్యక్తిగతంగా కాదు.. మైదానంలో అనుసరించే వ్యూహాలపైనే అని చెప్పుకొచ్చాడు.