ఏపీ లో 402 కి చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు
posted on Apr 11, 2020 2:50PM
రాష్ట్రవ్యాప్తంగా యాచకులు, నిరాశ్రయుల కోసం గాలింపు
ఏపీ లో కరోనా పాజిటివ్ కేసులు 402 కి చేరుకున్న దృష్ట్యా, ప్రభుత్వం నిబంధనలు తీవ్రతరం చేసింది. యాచకులు, నిరాశ్రయులపై అధికారులు, పోలీసులు అన్ని చోట్ల ఫోకస్ మొదలెట్టారు. బెజవాడలో యాచకులు, నిరాశ్రయుల కోసం పోలీసులు, రెవెన్యూ అధికారులు రోడ్లపై జల్లెడ పడుతున్నారు. ఐదు బస్సుల ద్వారా 250 మందికి పైగా యాచకులను షెల్టర్ లకు తరలించిన పోలీసులు, విఎంసి అధికారులు. బస్సులు దూకి పారిపోతున్న యాచకులను బలవంతంగా బస్సుల్లోకి ఎక్కిస్తున్న పోలీసులు.
యాచకులు, నిరాశ్రయులకు స్వచ్చంధ సంస్ధలు రోడ్లపైకి వస్తూ ఆహారం పంపిణీ చేస్తుండడంపై కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో బెజవాడ రోడ్లపై యాచకులను నిషేదించిన విఎమ్ సి. విజయవాడ పరిధిలో పది షెల్టర్ల లో యాచకులు, నిరాశ్రయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భోజన వసతి తో పాటు అన్ని ఏర్పాట్లు చేసిన విఎంసి అధికారులు. నగరంలో యాచకులు కనబడకుండా పటిష్ట చర్యలు చేపడుతున్న విఎమ్ సి అధికారులు.