బ్యాంకులకు కాస్త రిలీఫ్.. ఇంకా రూ.5,500 కోట్ల ఆస్తులు

విజయ్ మాల్యాకు అప్పులిచ్చి ఇరకాటంలో పడ్డ్ బ్యాంకులకు కాస్త ఊరట లభించే విషయం ఒకటి బయట పడినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ తన ఆస్తలు గ్యారంటీగా పెట్టి అప్పులు తీసుకున్న విజయ్ మాల్యాకు ఇంకా రూ.5,500 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయన్న విషయం తాజాగా వెలుగు చూసింది. దీంతో బ్యాంకులు కొంచం రిలీఫ్ అయ్యాయి. ఇప్పటికే మాల్యా తమకు గ్యారెంటీగా పెట్టిన ఆస్తులను విక్రయించిన బ్యాంకులు రూ. 1,200 కోట్లను రాబట్టుకున్నాయి. ఇప్పుడు ఈ ఆస్తులను కూడా బ్యాంకులు అటాచ్ చేసి కొంత మేర రుణాలను రాబట్టుకునే ప్రయత్నాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాకట్టు పెట్టని ఆస్తులను స్వాదీనం చేసుకునే హక్కు లేకపోయినా కోర్టును ఆశ్రయించి తద్వారా సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

 

ఇక మాల్యా కూడా ఎలాగూ దేశం విడిచిపోయినట్టు తెలుస్తోంది కాబట్టి కోర్టు ఆ ఆస్తులను జప్తులను చేసి..వేలం వేసి వచ్చిన సొమ్ముతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను బకాయిలతో పాటు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, పీఎఫ్ బకాయిలు తీర్చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu