ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు?
posted on Dec 4, 2015 12:17PM

వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవికాలం వచ్చే ఏడాది జూన్ నాటికి ముగుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆతరువాత వెంకయ్య ఏం చేస్తారు అన్నది అందరి సందేహం. అయితే బీజేపీ నియమాల ప్రకారం ఒక వ్యక్తి మూడుసార్లు రాజ్యసభ సభ్యత్వం పొందిన తరువాత.. ఆవ్యక్తికి ఇక ఆ పదవి నుండి పోటీ చేసే అవకాశం లేదు. దీంతో వెంకయ్యకు రాజ్యసభనుండి పోటీ చేసే అవకాశం లేదు. పార్టీ నియామాలను పాటించడంలో బీజేపీకి మంచి గుర్తింపు ఉంది. అయితే వెంకయ్య నాయుడి లాంటి నాయకుడికి మాత్రం దానికి మినహాంపు ఉండే అవకాశం ఉంటుందేమో అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు వెంకయ్యనాయుడు కోసం తమ నియామాన్ని పక్కన పెడుతుందన్న నమ్మకం చాలామందిలో కనిపించడం లేదన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అలా అయితే వెంకయ్య లోక్ సభ నుండి పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ వెంకయ్య మాత్రం దానికి సముఖత చూపడం లేదు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఉపరాష్ట్రపతిగా వెంకయ్యను ఎన్నికల్లో నిలపాలని మోడీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తన గడువు ముగిసిన తరువాత ఓ ఆరు నెలలు వెంకయ్యను మంత్రిగా కొనసాగించి.. ఆతరువాత 2017 లో జరగబోయే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యను నిలిపి ఆ పదవిని కట్టబెట్టాలని చూస్తున్నారంట.
మొత్తానికి వెంకయ్యను మాత్రం మోడీ వదులుకునే స్థితిలో లేరు. ఆయనను లోక్ సభ లేదా.. రాజ్యసభ సభ్యుడిగా లేదా.. అదికాని పక్షంలో ఉపరాష్ట్రపతిగా చేయాలని మోడీ చూస్తున్నారు. మరి వెంకయ్యకు ఏపదవి వరించబోతుందా చూడాలి.