అమెరికా అద్యక్షుడి ఎన్నికకూ స్టార్ల సాయం కావల్సిందే !
posted on Sep 12, 2012 10:29AM
ఫిల్మ్ స్టార్ల సాయంలేకుండా ప్రస్తుతం ఏదేశంలోనూ ఎన్నికలు జరగటం లేదు ! భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతంలో సిన్మాస్టార్లు రాజకీయ ప్రచారంలో పాల్గొనడం అతిమామూలు విషయమై పోయింది ! ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఒక్క భారతదేశంలోనే సినీస్టార్స్ రాజకీయప్రచారం ఎక్కువని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ఈ విధానం తెగనచ్చేసిందో ఏమో గానీ, తనకు మద్దతుగా ఫిల్మ్‌స్టార్ల చేత ప్రచారం చేయించేసు కుంటున్నారు. కోరిక ఒబామాదే అయినా` స్టార్లు మాత్రం తమంతట తాముగా స్వచ్ఛందంగా ప్రచారం చేస్తామంటూ చెప్పేస్తున్నారు. ఇటీవల జరిగిన డెమోక్రాటిక్ ప్రతినిధుల సభలో హాలీవుడ్ తారలు ఈవా లాంగోరియా, స్కార్‌లెట్ జోహన్‌సన్, కేర్రీ వాషింగ్టన్‌లు పాల్గొని ఒబామా వల్ల మాత్రమే అమెరికా మరింత పురోగమిస్తుందని గట్టిగా చేప్పేశారు !