సునామీలు విరుచుకుపడినా.. "బంతి" కాపాడుతుంది

బంతి ఏంటి..? సునామీలు వస్తే కాపాడటమేంటి అనుకుంటున్నారా..సునామీలు, భూకంపాలు, హరికేన్‌ల వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు జరిగే ప్రాణనష్టం ఊహకందదు. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ప్రాణాల్ని కాపాడలేం. ఒక్కసారిగా విపత్తులు తలెత్తితే ఎక్కడ తలదాచుకోవాలో..ప్రాణాలు రక్షించుకోవడం ఎలాగో తెలియని పరిస్థితుల్లో ఒక బంతి మీ ప్రాణాలు కాపాడుతుంది.

 

 

2004లో వచ్చిన ఇండోనేషియా సునామీని ప్రేరణగా తీసుకుని బ్రిటన్‌కు చెందిన ఏరోనాటికల్ శాస్త్రవేత్త జూలియన్ షార్ప్ బృందం విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు వీలుగా బంతిలాంటి సాధానాన్ని రూపొందించింది. గోళాకారంలో ఉండే దీనిలోకి ప్రవేశించేందుకు ఒక మార్గం ఉంటుంది. బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వీలుగా గాజు అద్దాల కిటికీలుంటాయి. ఎంత నీరు చుట్టుముట్టినా ఇది తేలుతుంది. సునామీలు, భూకంపాలు, హరికేన్‌ల వంటి భయంకర ప్రకృతి విలయాల సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పట్టేలా వివిధ పరిమాణాల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.