ఇంచు భూమి కూడా లేదు..
Published on: Mon Jun 12, 2017 5:04PM

తెలంగాణ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కె దండుమైలారంలోని భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి చెందిన భూములను కె.కె కుటుంబం కొనుగోలు చేసిందని వార్తలు వచ్చాయి. అయితే అందులో ప్రభుత్వ భూములు ఏమాత్రం లేవని ఇప్పటికే కె.కె వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు శంషాబాద్ లో ఉన్న భూములపై స్పందించి ఆయన...శంషాబాద్ లో మాత్రం తనకూ, తన కుటుంబ సభ్యులకూ ఇంచు భూమి కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. తన కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


