ఏపీలోనూ టీఆర్ఎస్ శాఖ...

Publish Date:Aug 26, 2014

 

తెలంగాణ రాష్ట్ర సమితి శాఖను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందని గుంటూరుకు చెందిన ఒక న్యాయవాది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి లేఖ రాశారు. తెలంగాణలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీకి కేవలం ఆ ప్రాంతానికే పరిమితం చేయాల్సిన అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా విస్తరించాలని సదరు న్యాయవాది తన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అద్భుతంగా పరిపాలిస్తున్నారని ఆ లేఖలో కితాబు ఇచ్చారు.

By
en-us Political News