నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ!

కలియుగ వైకుంఠమైన తిరుమల బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరుగుతుంది.  రేపు ధ్వజారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈనెల 8న జరిగే శ్రీవారి గరుడసేవకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 9న శ్రీవారి స్వర్ణరథోత్సవం, 11న ర‌థోత్సవం, 12న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావ‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 13 బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.  తిరుమలలో దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంటుందని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అందుబాగులో 2 వేలకు పైగా సీసీ కెమెరాలను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu