అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేసే ప్రసక్తే లేదు.. మూడు వేల భవనాలు
posted on May 25, 2016 3:27PM
.jpg)
తెలంగాణ పాలేరు ఉపఎన్నికలో తుమ్మల ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాలకు మూడు వేల శాశ్వత భవనాలను నిర్మిస్తామని.. భవనాల నిర్మాణం కోసం కేంద్రంనుంచి నిధులు అందకపోయినా, రాష్ట్రమే పూర్తిగా భరిస్తోందని ఆయన అన్నారు. స్త్రీ శిశు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులను ఖర్చు చేస్తూ అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తోందని ఆయన చెప్పారు. అంతేకాదు రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణకు ట్రాకింగ్ విధానం అమలు చేస్తామని తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.