ఉద్యమ నేప‌ధ్యంలో టెట్ వాయిదా

 

సీమాంద్రలో వెల్లువెత్తుతున్న నిర‌స‌న‌ల హోరు ఉద్యోగావ‌కాశాల మీద కూడా ప్రభావం చూపుతుంది. సీమాంద్ర ప్రాంత‌లో వెళ్లువెత్తుతున్న నిర‌స‌న‌ల నేప‌ధ్యంలో సెప్టెంబ‌ర్ 1 జ‌ర‌గాల్సిన టెట్ ప‌రీక్ష వాయిదా ప‌డింది. ఈ మేరుకు రాష్ట్ర ఉన్నత విధ్యాశాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప‌రీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వర‌లోనే ప్రక‌టిస్తామ‌న్నారు.

ఈ మేర‌కు టెట్ క‌న్వీన‌ర్ జ‌గ‌న్నాధ్ రెడ్డి ఓ ప్రక‌ట‌న చేశారు. ముఖ్యమంత్రి కార్యాల‌యం నుంచి ఆదేశాలు అందిన తరువాత అధికారికంగా ప్రక‌టిస్తామ‌ని చెప్పారు. ఇప్పటికే సీమాంద్రలోని పాఠ‌శాల‌ల‌పై ఉద్యమ ప్రభావం బాగా ఉండ‌గా ఉపాధ్యాయుల స‌మ్మెతో అది మ‌రింత ఎక్కువైంది దీంతో ప్రభుత్వానికి టెట్ వాయిదా వేయ‌క త‌ప్పలేదు. ఈ ప‌రీక్ష రాసేందుకు 4 ల‌క్షల 47 వేల‌మంది అభ్యర్ధులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.