భార‌త్‌లో అమ్మాయిల‌కు ప్రత్యక్ష న‌ర‌క‌మే..

 

ప్రపంచ ప‌టం మీద స‌గ‌ర్వంగా నిల‌బ‌డాల్సిన భార‌త్ ఇప్పుడు అనేక విమ‌ర్శలు ఎదుర్కొంటుంది. ముఖ్యంగా దేశంలో జ‌రుగుతున్న లైంగిక దాడులు అంత‌ర్జాతీయ స్ధాయిలో మ‌న దేశం ప‌రువు తీస్తున్నాయి. ముఖ్యంగా మ‌న‌దేశ యువ‌తుల‌తో పాటు ఇత‌ర దేశాల‌నుంచి వ‌చ్చే అమ్మాయిల‌పై కూడా ఇక్కడ ఆగ‌డాలు శృతి మించుతున్నాయి.

ఇలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి ఇప్పుడు భార‌త్ ప‌రువు తీసింది.. మూడు నెల‌ల పాటు టూరిస్ట్‌గా ఇండియాకు వ‌చ్చిన ఓ అమెరిక‌న్‌ అమ్మాయిలో భార‌త్‌లో అమ్మాయిల ప‌రిస్థితిని క‌ళ్లకు క‌ట్టిన‌ట్టుగా వివ‌రించింది. అంతేకాదు భార‌త్ యాత్రికుల‌కు స్వర్గదామ‌మేగాని అమ్మాయిల‌కు మాత్రం ప్రత్యక్షన‌ర‌కం అని వ్యాఖ్యానించింది.

చికాగో యూనివర్సిటీకి చెందిన మైఖేలా క్రాస్ అనే అమ్మాయి రోజ్ చాస్మ్ అనే పేరుతో సీఎన్ఎన్ ఐ రిపోర్ట్లో మ‌న‌దేశంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న ప‌రిస్ధితుల‌పై ఓ వ్యాసం రాసింది. భారత పర్యటనలో తాను ఎదుర్కొన్న వేదింపుల‌ను, వాటివల్ల త‌ను ఎంత మ‌నోవేద‌న‌కు గురైందో స‌వివ‌రంగా ఆ వ్యాసంలో వివ‌రించింది.''ఇండియాః ద స్టోరీ యు నెవర్ వాంటెడ్ టు హియర్'' అనే పేరుతో ఆమె ఈ వ్యాసాన్నిరాసింది. ప్రస్థుతం ఈ వ్యాసం ప్రపంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టింస్తుంది.

ఎంత‌టి ప్రకృతి అందాలు, ప‌ర్యాట‌క ప్రదేశాలు చ‌రిత్ర ఉన్న భార‌త్ అమ్మాయిల‌కు ఏమాత్రం శ్రేయ‌స్కరం కాద‌ని అందుకు తాను ఎదుర్కొన్న అనుభావాల‌నే సాక్షాలుగా చూపించింది.