మోడీ పర్యటన ముంగిట పేలుడుతో ఉగ్ర సవాల్!

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి హోదా రద్దు చేసిన తరువాత తొలి సారిగా రాష్ట్రంలో మోడీ పర్యటిస్తున్నారు. అయితే ఆయన పర్యటనకు ఉగ్ర మూకలు పేలుళ్లతో స్వాగతం పలికారు. మోడీ సభా స్థలికి కేవలం 12 కిలో మీటర్ల దూరంలో భారీ పేలుడు సంభవించింది. 

అయితే ఈ పేలుడు మోడీ రాకకు కొన్ని గంటల ముందు జరగడంతో ఎటువంటి జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడులు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా మోడీ పర్యటన సందర్భంగా ఉగ్రమూకలు విరుచుకుపడే అవకాశం ఉందన్న సమాచారంతో గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో బలగాలు జల్లెడపడుతున్నాయి. వేర్వేరు సంఘటనల్లో ఎనిమిది మంది ముష్కరులను మట్టుపెట్టాయి. అయితే ఆదివారం అంటే మోడీ రాష్ట్రంలో పర్యటించే రోజున ఉగ్రమూకలు విధ్వంసానికి తెగబడ్డాయి. 
ఉగ్రమూకలను ఏరివేస్తున్నామని జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం, భద్రతా బలగాలు ఎంత గట్టిగా చెబుతున్నా... ఉగ్ర చర్యలు మాత్రం యథేచ్ఛగా సాగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. 
తాజాగా మోడీ సభ మరొ కొంత సేపటిలో ప్రారంభం అవుతుందనగా, ప్రధాని బహిరంగ సభ జరగనున్న సాంబా జిల్లాలోని పల్లీ గ్రామానికి ఇది సమీపంలో సభావేదికకు కేవలం 12 కిలో మీటర్ల దూరంలో భారీ పేలుడు సంభవించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu