రాజయ్య పేషీ ప్రక్షాళన

 

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖమంత్రి రాజయ్యను పదవుల నుంచి తప్పించే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆయన్ను మంత్రి పదవుల నుంచి తప్పించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. భారీ స్థాయిలో అవినీతికి పాల్పడటం వల్ల ఆయన్ని పదవి నుంచి తొలగించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో రాజయ్య, ఆయన వర్గీయులు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడినట్టుగా నిఘా వర్గాలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సమాచారం అందించినట్టు తెలుస్తోంది. రాజయ్య అవినీతి వ్యవహారం మీద గతంలోనే సీఎం కేసీఆర్ హెచ్చరించినప్పటికీ రాజయ్య పట్టించుకోలేదని తెలుస్తోంది. రాజయ్య వ్యవహారం తనకు, తన ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారడంతో ఇక రాజయ్యని తొలగించక తప్పని పరిస్థితిని సీఎం కేసీఆర్ ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాజయ్య పనితీరు నాసిగా వుండటాన్ని కూడా సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. ఆస్పత్రుల్లో సిబ్బంది లంచం తీసుకున్నా పర్లేదంటూ మంత్రి రాజయ్య గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా కౌంటయ్యాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu