TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జేసీపై నిషేధం ఎత్తివేత..ఇక విమానాలు ఎక్కవచ్చట..!

Published on: Wed Jul 19, 2017 4:41PM

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి విమానాలు ఎక్కకుండా ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్నారు అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కేందుకు ప్రయత్నించిన ఆయనను దించివేశాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏకంగా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు జేసీ. ఈ నేఫథ్యంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో చర్చించి వివాదాన్ని పరిష్కరించుకోవాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ట్రావెల్ బ్యాన్ ఎత్తివేస్తూ ఓ ప్రకటన జారీ చేయడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. ఇదే బాటలో ఇతర విమానయాన సంస్థలు కూడా నడిచే అవకాశం ఉంది.