జాతీయ రాజకీయాల గతినే మార్చివేసిన రోజది!

‘1982 మార్చి 29వ తేదీ'కి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రముఖ స్థానం ఉంది. ఆ మాటకు వస్తే జాతీయ రాజకీయాల గతినే మార్చివేసిన రోజది. కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న ఆ రోజుల్లో ‘తెలుగు ఆత్మగౌరవం' పేరిట ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్ ‘తెలుగుదేశం పార్టీ'ని స్థాపించారు. స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర లిఖించింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏపీలో సాగుతూ వచ్చిన ఏకపార్టీ పాలనకు చరమగీతం పాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా వున్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చంద్రగిరిలో ఘోర పరాజయాన్ని చవి చూశారు. ఆ త‌రువాత చంద్రబాబు టీడీపీలో చేరి పార్టీలో పట్టు సాధించారు.

అమెరికాలో ఎన్టీఆర్.. తెర వెనుక నాదెండ్ల సరిగ్గా ఏడాది కాలానికే 1984లో గుండె ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్లిన ఎన్టీఆర్.. ఆయన అక్కడ ఉండగానే తెర వెనుక సాగిన రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పావులు కదిపింది. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా నాదేండ్ల భాస్కర్ రావు సారథ్యంలో ‘ఫిరాయింపుల' పర్వానికి తెర తీశారు. కానీ కొందరు అధికార టీడీపీ ఎమ్మెల్యేలు పరిస్థితి సంగతి బయట పెట్టారు.

వెంటనే చంద్రబాబు తదితరులు అప్రమత్తమయ్యారు. అమెరికాలో శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన ఆఘమేఘాల మీద బయలుదేరి వచ్చేశారు. ప్రమాణం చేయించిన గవర్నర్ రాంలాల్ 1984 ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. కానీ ఆ వెంటనే నాదేండ్ల భాస్కర్ రావుతో నాటి రాష్ట్ర గవర్నర్ రామ్ లాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించడంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ ఉవ్వెత్తున ఎగసి పడింది.

ఇటు నాదేండ్ల భాస్కర్‌రావు, అటు ఎన్టీఆర్ తన మద్దతుదారులతో వేర్వేరు క్యాంపులు నెరిపారు. జాతీయ స్థాయిలో విపక్షాల మద్దతు కూడా దండిగానే లభించింది. రాష్ట్రపతి ముందు ఎమ్మెల్యేలతో పరేడ్ తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేలతో నాటి రాష్ట్రపతి ముందు ఎన్టీఆర్ పరేడ్ నిర్వహించారు. తదనంతర పరిణామాల్లో గవర్నర్‌గా రాంలాల్‌కు ఉద్వాసన పలికిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ.. ఆ స్థానే శంకర్ దయాళ్ శర్మను గవర్నర్‌గా నియమించారు. ఆ తర్వాత సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం జరిగిపోయాయి. కానీ మళ్లీ ప్రజాతీర్పు పొందాలని భావించారు. 1985లో అసెంబ్లీకి జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.