ముగిసిన ఎన్నికలు.. జయలలిత ఎక్కడ..?

 

తమిళనాడు ఎన్నికలు చాలా ప్రశాంతంగా ముగిశాయి. ఇక ఫలితాలు ఎల్లుండి అంటే 19వ తేదీన విడుదల కానున్నాయి. అయితే ఇప్పుడు అందరి సందేహం ముఖ్యమంత్రి జయలలిత ఏది అని. అలా ఎన్నికలు ముగిశాయో లేదో.. ఆమె ఎవరికీ దర్శనమివ్వడంలేదట. అంతేకాదు పోయిస్ గార్డెన్ లోని తన ఇంటికి వచ్చిన కొందరు మంత్రులను కలవడానికి కూడా ఆమె నిరాకరించిందట. అయితే దీనికి కారణం ఏంటంటే.. వివిధ సంస్థలు తెలిపిన సర్వేలు ఈసారి ఫలితం జయలలితకు వ్యతిరేకంగా రానుందని చెప్పడమేనట. అందుకే ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకూ జయలలిత ఎవరికీ దర్శనమివ్వదని సమాచారం. 

 

కాగా ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం ఈసారి డీఎంకే పార్టీ విజయం సాధిస్తుందని అన్నాడీఎంకే ఓటమి పాలవుతుందని సర్వేలు చెబుతున్నాయి. అంతేకాదు గత మూడు దశాబ్దాల్లో ఏ పార్టీకీ వరుసగా రెండు సార్లు అధికార పీఠాన్ని ఇవ్వని తమిళనాడు ఓటర్లు మరోసారి సంప్రదాయాన్ని పాటించనున్నారని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మరి ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎంత వరకూ నిజమవుతాయి.. ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే ఫలితాల వరకూ ఆగాల్సిందే.