ఏపీలో మరోసారి అన్యమత ప్రచారం కలకలం 

ఏపీలో సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత గ్రామాలలోను పట్టణాలలోనే కాకుండా కొన్ని ప్రముఖ హిందూ దేవాలయాల వద్ద కూడా అన్యమత ప్రచారం ఘటనలు చేటు చేసుకోవడం తో దాని పై అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా పవిత్ర తిరుమల, సింహాచల దేవస్థానాలలో అన్యమత ప్రచారాలు జరగడం, వెబ్సైట్ లో ఏసు క్రీస్తు పాటలు ఉండడం వంటివి కలకలం రేపాయి. ఆ తర్వాత పరిస్థితి కొంత సద్దుమణిగింది. ఐతే తాజాగా మరో సారి అన్యమత ప్రచారానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి.

ఐతే తాజాగా గుంటూరుకు చెందిన ఒక వ్యక్తికి జరిగిన సంఘటన మళ్ళీ తిరుమలలో జరుగుతున్న అన్యమత ప్రచారాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆ వ్యక్తికి గత పదేళ్ల నుండి తిరుమల నుండి వెలువడే సప్తగిరి మాస పత్రిక కు సబ్ స్క్రిప్షన్ ఉంది. ఐతే తాజాగా వచ్చిన సప్తగిరి మాస పత్రిక తో పాటు అన్య మత ప్రచారానికి సంబంధించిన “సజీవ సువార్త” అనే పుస్తకం కూడా ఆయనకు చేరింది. దీంతో ఆశ్చర్యపోయిన అయన ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో మరో సారి తిరుమలలో అన్యమత ప్రచారం పై తీవ చర్చ జరిగే అవకాశం ఏర్పడింది.