సీఎం ఆఫీసు ముందు ఆత్మహత్యాయత్నం

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముందు ఒక వ్యక్తి శనివారం నాడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. నాచారానికి చెందిన రాజు అనే వ్యక్తి శనివారం ఉదయం సీఎం కార్యాలయం దగ్గరకి వచ్చాడు. తనకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించాలని అడిగాడు. అయితే భద్రతా అధికారులు దానికి నిరాకరించారు. తన ప్రియతమ ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇవ్వలేదంటూ రాజు తన ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. సమయానికి పోలీసులు అడ్డుకుని అతన్ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కి తరలించి విచారణ జరిపారు. తాను పనిచేస్తున్న ప్రదేశంలో తనను ఉద్యోగం నుంచి అన్యాయంగా తొలగించారని, ఆ విషయాన్ని విన్నవించుకోవడానికి ముఖ్యమంత్రిని కలవటానికి వస్తే అనుమతించకపోవడం తన మనోభావాలు దెబ్బతిని ఆత్మహత్యా ప్రయత్నం చేశానని అతను వాపోతూ చెప్పినట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu