బాబోయ్ అగ్ని ప్రమాదాలు...

 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం జరిగిన రెండు అగ్ని ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని టీవీఎస్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 50 లక్షల రూపాయల ఆస్తినష్టం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అలాగే విజయనగరం జిల్లా వేపాడు మండలంలోని ఆకుల సీతంపేట గ్రామంలో శనివారం తెల్లవారుఝామున జరిగిన అగ్ని ప్రమాదంలో 12 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 4 లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగినట్టు బాధితులు తెలిపారు. గ్రామస్థులు సకాలంలో అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం సంభవించలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu