స్వామి కౌంటర్లు మోడీకేనా..?


బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందించి ఆయనకు చురకలు అంటించిన సంగతి తెలిసిందే. ఎవరైనా వ్యవస్థ కంటే తాము గొప్పవారమని అనుకుంటే అది తప్పు అని... పబ్లిసిటీ మోజుతో వ్యాఖ్యలు చేయడం సరికాదని స్వామిపై పరోక్షంగా మండిపడ్డారు. అయితే ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్వామి కాస్త వెనక్కి తగ్గుతాడులే అనుకుంటే.. మోడీకి పరోక్షంగా కౌంటర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విమర్శల బాణాలు వదిలారు.

 

"రాజకీయ నాయకులారా... కొత్త సమస్య: ఓ రాజకీయ నాయకుడు పబ్లిసిటీ కావాలని అనుకుంటే, 30 ఓబీ వ్యాన్లు ఇంటి బయట ఉంటాయి. చానళ్లు, ప్రచార డబ్బా కొట్టే వారి నుంచి 200 మిస్డ్ కాల్స్ వస్తాయి"  అంటూ పరోక్షంగా మోడీకి కౌంటర్ ఇచ్చారు. మరి స్వామి వ్యాఖ్యలపై బేజీపీ నేతలు ఎలా స్పందిస్తోరో.. ముఖ్యంగా మోడీ ఎలా స్పందిస్తారో చూడాలి.

 

 

కాగా ఈమధ్యకాలంలో స్వామి వరుసపెట్టి అందరిపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్భీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నుండి మొదలు  పెట్టి ఆఖరకి ఇప్పుడు పరోక్షంగా మోడీపై కూడా పరోక్షంగా కామెంట్లు వేసే స్థాయికి వెళ్లారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.