స్పీడ్ న్యూస్ 3

రాజీనామా ప్రశక్తే లేదు: మణిపూర్ సీఎం

26.మణిపూర్  హింసాకాండ, మహిళల నగ్న ఊరేగింపు ఘటన నేపథ్యంలో  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్   రాజీనామాకు పెద్ద ఎత్తున డిమాండ్   వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.  ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ కార్యకర్తనని, తాను రాజీనామా చేసే సమస్యే లేదన్నారు.

..............................................................................................................................................................

పార్లమెంటును స్తంభింపచేయడం సరికాదు: విజయసాయి

27. పార్లమెంటును స్తంభింపజేయడాన్ని వైసీపీ సమర్థించదని ఆ పార్టీ ఎంపీ విజయసాయి అన్నారు. మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా  చెప్పిన తరువాత కూడా విపక్షాలు సభాకార్యక్రమాలను  అడ్డుకోవడంలో అర్ధం లేదని అన్నారు.

..........................................................................................................................................................

బీఆర్ఎస్ నో కాన్ఫిడెన్స్ మోషన్

28. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై  విపక్షాలు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చాయి. అలాగే బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు వేరుగా మరో నోటీసు ఇచ్చారు.   మణిపూర్  హింసాకాండపై సభలో మోడీ ప్రకటనకు విపక్షాలు పట్టుబడుతున్న సంగతి విదితమే.

...........................................................................................................................................................

తల్లి సంరక్షణ విస్మరించిన కుమార్తెకు ఆమె ఆస్తిపై హక్కులు ఉండవు

29. తల్లి సంక్షరణ గురించి విస్మరించిన కూతురికి ఆమె ఆస్తిపై హక్కులు ఉండవని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. తల్లి ఆలనాపాలనా చూసుకోని ఓ కూతురి ఆస్తి రిజిస్ట్రేషన్ హక్కులను రద్దు చేస్తూ   రెవెన్యూ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానం సమర్థించింది.  

.....................................................................................................................................................

ప్రతి నెలా ఇండియా సమావేశాలు

30.  ప్రతిపక్ష కూటమి ఇండియా  ఇక నుంచి  ప్రతి నెలా ఒక రాష్ట్రంలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాయి. అందులో భాగంగా ఇండియా మూడో సమావేశం వచ్చే నెల రెండో వారంలో ముంబైలో జరగనుంది.  

........................................................................................................................................................

కుప్పంలో గెలిపిస్తే భరత్ ను సీఎం చేస్తాం: మంత్రి పెద్దిరెడ్డి

31. ఏపీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలలో కుప్పం నియోజకవర్గం నుంచి భరత్ ను గెలిపిస్తే భరత్   ముఖ్యమంత్రిని అవుతారన్నారు.   ఆ వెంటనే పొరపాటు సవరించుకుని భరత్ ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ చెప్పారని అన్నారు.

......................................................................................................................................................

హనుమాన్ జంక్షన్ బస్టాండ్ జలమయం

32.ఎ డతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో హనుమాన్‌ జంక్షన్‌ బస్టాండ్‌ జలమయమైంది. భారీగా నీరు చేరడంతో బస్టాండ్ లో నిలుచునేందుకు కూడా అవకాశం లేక ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.  

..............................................................................................................................................................

రోడ్డుపై గుంతలలో వరినాట్లతో నిరసన

33.చిత్తూరు జిల్లా కుప్పం బైపాస్ మార్గం రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో బుధవారం తెదేపా నాయకులు వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. నాలుగేళ్ల వైకాపా  హయాంలో కుప్పం అభివృద్ధి శూన్యమని వారు ఆరోపించారు.

...........................................................................................................................................................

ఆర్వింద్ కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణుల ఆందోళన

34.  ఎంపీ అర్వింద్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.  అర్వింద్‌ ఏకపక్షంగా 13 మండలాల అధ్యక్షులను మార్చారని ఆరోపిస్తూ బీజేపీ  రాష్ట్ర కార్యాలయం వద్ద  నిజామాబాద్‌ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి న్యాయం చేయాలని కోరారు. 

......................................................................................................................................................

జీవీ ఆంజనేయులుపై అక్రమ కేసులు: ప్రత్తిపాటి పుల్లారావు

35. తెలుగుదేశం నేత జీవీ ఆంజనేయులుపై అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఎమ్మెల్యే బొల్లా ప్రోద్బలంతోనే ఆంజనేయులుపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే బొల్లా దోపిడీపై ప్రశ్నిస్తే కేసు పెట్టడం దుర్మార్గమన్నారు.  

.............................................................................................................................................................

సీమకు జగన్ తీరని ద్రోహం: చంద్రబాబు

36. రాయలసీమకు జగన్ తీరని ద్రోహం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. కేంద్రంతో పోరాడి తెలుగుగంగ సాధించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని గుర్తుచేశారు. నదుల అనుసంధానంతో తి ఎకరాకు నీరు ఇవ్వవచ్చని వివరించారు.  

...........................................................................................................................................................

వి. కొత్తకోటలో సచివాలయాని తాళం

37. అనంతపురం జిల్లా  వి.కొత్తకోటలో   బీసీ కాలనీ వాసులు సచివాలయానికి తాళం వేసి ఆందోళనకు దిగారు. రోడ్లపై నిలిచిన నీటిలో వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. రహదారులు, మురుగు కాల్వలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. 

...............................................................................................................................................................

కేంద్రం నిధుల దారిమళ్లిస్తున్నారు: పురంధేశ్వరి

38. కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. పంచాయతీలను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆమె జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. 

............................................................................................................................................................

కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన

39. జీవో నంబర్ 46 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కానిస్టేబుల్ అభ్యర్థులు  తెలంగాణ సచివాలయం  ఆందోళనకు దిగారు. పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

..........................................................................................................................................................

రైతుల పొట్ట కొడుతున్న జగన్ సర్కార్ : సోమిరెడ్డి

40.  ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందని  మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రైతులకు అందే కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలను జగన్ సర్కార్ నిలిపివేసిందన్నారు.

............................................................................................................................................................

అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఆమోదం

41. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్‌ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. అన్ని పార్టీలతో మాట్లాడి చర్చకు సమయం ప్రకటిస్తామని వెల్లడించారు.  

..........................................................................................................................................................

కొత్తగూడెం ఎమ్మెల్యేగా గుర్తించండి: జలగం

42.  కొత్తగూడెం ఎమ్మెల్యేగా తనను గుర్తించాలని కోరుతూ జలగం వెంకట్రావు శాసనసభ కార్యదర్శిని కలిశారు. వనమా ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పు ప్రతులను ఆయన ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. 

...............................................................................................................................................................

రైతు వద్దకు బీజేపీ: కిషన్ రెడ్డి

43.  రైతు వద్దకు బీజేపీ కార్యక్రమాన్ని రేపటి  నుంచి చేపట్టనున్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.  ఈ కార్యక్రమంలో వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తామని  2.8 కోట్ల దుకాణాలను కిసాన్‌ సమృద్ధి కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేస్తామని వివరించారు. 

...............................................................................................................................................................

అలా బండి నడిపితే 20 వేలు జరిమానా

44. ఏపీలో ఇకపై చెవులకు హెడ్ ఫోన్స్ తగిలించుకుని  వాహనం నడిపితే  భారీ జరిమానా తప్పదు. వచ్చే నెల 1 నుంచి ఏపీలో హెడ్ ఫోన్స్ తగిలించుకుని వాహనం నడిపితే 20 వేల రూపాయలు జరిమానా విధిస్తారు.   ఈమేరకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

.......................................................................................................................................................

విపక్షాల వెర్రికి నిదర్శనం: జీవీఎల్

45.కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వడాన్ని విపక్షాల వెర్రికి నిదర్శనంగా బీజేపీ ఎంపీ  జీవీఎల్ అభివర్ణించారు.  సంఖ్యా పరంగా అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని చెప్పారు. బీజేపీ ఎన్డీఏకి 330 పైగా సంఖ్యాబలం ఉందని అన్నారు.  

............................................................................................................................................................

అందుకే అవిశ్వాసం: నామా

46. మణిపూర్ హింసాకాండపై ప్రధాని మోడీ మాట్లాడితేనే దేశ ప్రజలలో శాంతి నెలకొంటుందని, అయితే విపక్షాలు ఎంతగా డిమాండ్ చేస్తున్నా మోడీ నోరు విప్పడం లేదని బీఆర్ఎస్ ఎంపి నామా నాగేశ్వరరావు అన్నారు.  అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని నామా చెప్పారు.

...............................................................................................................................................................

వర్షాలు, వరద కష్టాలలో ప్రజలను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం: రేవంత్

47.వర్షాలు, వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే  వారిని  ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ గానీ ఎలాంటి  చర్యలు తీసుకోవడం లేదన్నారు.  

...........................................................................................................................................

ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధం: ఎమ్మెల్సీ కవిత

48. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ మేరకు ఆమె ఒక ట్వీట్ లో ప్రభుత్వం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు.

....................................................................................................................................................

క్యాస్ట్ సెన్సెక్స్ అన్న ఒకే ఒక్కడు రాహుల్: వీహెచ్

49.యావత్ భారతదేశం‌లో  క్యాస్ట్ సెన్సెక్స్ చెస్తానని  చెప్పిన ఘనత రాహుల్ కు మాత్రమే దక్కుతుందని కాంగ్రెస్ నేత వీహెచ్ అన్నారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రాహుల్ గాంధీ మాత్రమే బీసీల గురించి మాట్లాడారని  అన్నారు.

......................................................................................................................................................

జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సెలవలు రద్దు

50. భారీ వర్షాల నేపథ్యంలో  జీహెచ్ఎంసీ ఉద్యోగులకు  సెలవులు రద్దు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప సెలవురు తీసుకోవద్దన్నారు.   భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న  హెచ్చరికలతో సెలవులు రద్దు  చేసినట్లు చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu