బీజేపీకి చంద్రబాబు గౌర‌వ ప్ర‌చార కార్య‌ద‌ర్శి..!!


 

అసలే టీడీపీ, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.. అలాంటిది బీజేపీకి చంద్రబాబు గౌరవ ప్రచార కార్యదర్శి ఏంటి అనుకుంటున్నారా?.. ఈ మాట స్వయానా బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు.. ఏపీకి మోడీ ప్రభుత్వం ఎంతో చేసిందట.. కానీ టీడీపీ, చంద్రబాబే విమర్శలు చేస్తున్నారట.. ఏపీలో రెండు శాతం ఓట్లు కూడా బీజేపీకి రావ‌ని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు అంటున్నార‌నీ.. కానీ రోజూ భాజ‌పా, మోడీ గురించే ఆయ‌న మాట్లాడుతున్నార‌నీ.. ఇంత‌కంటే సంతోషించద‌గ్గ విష‌యం ఏముంటుంద‌ని వీర్రాజు అన్నారు.. ఈరోజున ఏపీలో బీజేపీకి చంద్ర‌బాబు గౌర‌వ ప్రధాన ప్ర‌చార కార్య‌ద‌ర్శి అని ఎద్దేవా చేశారు.. అదే విధంగా ఏపీలో మోడీ లేక‌పోతే చంద్ర‌బాబు జీరో అన్నారు.. ఆంధ్రాలో మోడీ హీరో అన్నారు.. రాష్ట్రంలో చెరువులు త‌వ్వే కార్య‌క్ర‌మానికి రూ. 13 వేల కోట్లు ఖ‌ర్చుపెట్టార‌ని, దాంతో పోల‌వ‌రం ప‌నులు అయిపోయేవ‌ని అన్నారు.. కేంద్రం ఇచ్చిన స‌బ్సిడీలు, నిధులు, ప‌థ‌కాలూ అన్నీ తినేస్తున్నార‌ని వీర్రాజు ఆరోపించారు.