పవన్ రాజకీయాలకు పనికిరాడు..!
posted on May 1, 2017 11:25AM

పవన్ చాలా మంచి వ్యక్తి... పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు... ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరనుకుంటున్నారా..? ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తాను పెట్టుబడులు పెట్టలేనని, ఎలక్షన్స్ లో గెలుస్తానో లేదో అన్న పవన్ మాటలపై ప్రస్తావిస్తూ.. రాజకీయ నాయకులకు ఈ తరహా దృక్పథం పనికిరాదని, బలమైన చిత్తంతో రాజకీయాల్లో ఉండాల్సి ఉంటుందని చెప్పారు. అంతేకాదు పవన్ చాలా మంచి వ్యక్తి... ఆయన ప్రజల మంచిని కోరుతారనడంలో సందేహం లేదు.. కానీ రాజకీయాలకు పనికిరాడు అని అన్నారు. పవన్ కల్యాణ్ ఏ సమస్యపై మాట్లాడినా, అందులో కొంత అర్థం ఉంటోందని, వాటి పరిష్కారానికి తమ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు. లోపల ఒకటి పెట్టుకుని తన స్వప్రయోజనాల కోసం జగన్ మాదిరిగా పైకి వ్యవహరించే వ్యక్తి పవన్ కాదని అన్నారు.