జగన్‌కు అరెస్ట్ భయం..హైకోర్టులో పిటిషన్

 

వైసీపీ అధినేత జగన్ , ఆ పార్టీ నేతలకు పల్నాడు ఫియర్ పట్టుకుంది. పోలీసుల ఆంక్షలను సవాల్ చేస్తూ జగన్ పల్నాడులో భారీ జన సందోహాన్ని మోహరించడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది. నాన్ బెయిలబుల్ కేసు కావడంతో జగన్ , బుధవారం హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు తీసుకున్న హైకోర్టు గురువారం విచారిస్తామని పేర్కొంది. విచారణ అనంతరం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది జగన్ తోపాటు వైసీపీ వర్గాల్లో ఉత్కంఠగా రేపుతోంది. కేసును కోర్టు క్వాష్ చేయకపోతే ఏ క్షణమైనా జగన్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని వైసీపీ శ్రేణుల్లో సర్వత్రా ఆందోళన కనిపిస్తోంది.

ఈ కేసుకు సంబంధించి ఆదివారం జగన్ డ్రైవర్ రమణారెడ్డిని అదుపులోకి తీసుకోగా…మంగళవారం జగన్ కారును సీజ్ చేసి నోటీసులు కూడా ఇచ్చారు పోలీసులు.ఈ క్రమంలోనే ఆయనను విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని అనుకున్నారో ఏమో, కేసును క్వాష్ చేయాలని జగన్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ జగన్ కు నిరాశ ఎదురైతే ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచే అవకాశం ఉంది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu