32 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ.. భక్తజన సంద్రంగా మారిన సింహాద్రి అప్పన్న ఆలయం

ప్రతిష్ఠాత్మక సింహాద్రి అప్పన్న ఆలయంలో బుధ, గురు (జులై 9, 10) జరిగే గిరి ప్రదక్షిణకు దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఏటా ఆషాఢమాసంలో జరిగే ఈ గిరి ప్రదక్షిణకు ఈ ఏడు పదిలక్షల మంది వరకూ హాజరౌతారన్న అంచనాతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

32 కిలోమీటర్లు జరిగే ఈ గిప్రదక్షిణకు  దాదాపు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి 6 కిలోమీటర్లకు ఒక అధికార బృందం పర్యవేక్షణ కోసం నియమించారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.  32 వైద్య శిబిరాలు, 18 అంబులెన్సులు, వైద్య బృందాలు గిరి  ప్రదక్షిణ మార్గం వద్ద ఏర్పాటు చేశారు.  సింహాద్రి అప్పన్న ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోకగజపతి రాజు స్వామి వారి ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి   జెండా ఊపి గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu