బాహుబలి 2 టికెట్లు బ్లాక్ లో కొన్న సీఎం..
posted on May 2, 2017 5:16PM

బాహుబలి 2 కోసం సినీ అభిమానులు ఎంతలా ఎదురుచూశారో అందరికి తెలిసిందే. ఒక్క సినీ అభిమానులే కాదు రాజకీయ నాయకుల్లో కూడా బాహుబలి మానియా అలాగే ఉంది. ఏకంగా సీఎంగారే బాహుబలి 2 సినిమా కోసం టికెట్లు బ్లాక్ లో కొనే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ సీఎం గారు ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరూ కర్ణాటక సీఎం సిద్ద రామయ్య గారు. సినిమా టికెట్ ధర రూ.200 మించొద్దు అని సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా ఆయన పెట్టిన నిబంధనను ఉల్లంఘించి... బ్లాక్ లో టికెట్లు కొన్నారు. తన పరివారంతో మూవీకి వెళ్లిన ఆయన... ఒక్కో టికెట్‌కు అక్షరాలా రూ.1050 చెల్లించారు. అంటే ఆయన పెట్టిన పరిమితికి ఐదు రెట్లు ఎక్కువ. ఇంకేముంది దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.