మొహాలి టెస్ట్: శిఖర్ ధావన్ సెంచరీ, రికార్డ్

Publish Date:Mar 16, 2013

భారత్, ఆస్ట్రేలియా మధ్య మొహాలిలో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారత్ కు శిఖర్ ధావన్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. తాను ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లోనే 85 బంతుల్లో సెంచరీ చేశాడు. దీంతో టెస్ట్ ఆరగ్రేటంలోనే వేగవంతమైన శతకం సాధించిన తొలి ఆటగాడిగా శిఖర్ ధావన్ రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం ఇండియా 159/0 తో ఆడుతోంది. మురళి విజయ్ 44, శిఖర్ ధావన్ 107 పరుగులతో క్రీజులో వున్నారు.

 

Shikhar Dhawan slams fastest century on debut, Shikhar Dhawan slams fastest century