శశికళకు మరిన్ని కష్టాలు... నెక్ట్స్ టార్గెట్ వారే...!
posted on Apr 27, 2017 1:27PM

ఇప్పటికే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి దినకరన్ ఈసీ అధికారులకు లంచం ఇస్తున్నారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసి.. అతన్ని కోర్టులో హాజరు పరచగా అతనికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో శశికళ వర్గానికి ఎక్కడాలేని సమస్యలు వచ్చిపడ్డాయి. ఒక దాని తరువాత ఒకటి సమస్య ఎదురవుతూనే ఉంది. అయితే ఇప్పుడు శశికళను మరింత ఇబ్బంది పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిన్నమ్మ కుటుంబం, బినామీలను టార్గెట్ చేసి త్వరలో మరిన్న దాడులకు ఆస్కారం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. మున్ముందు చిన్నమ్మకు మరిన్ని షాక్‌లు తగిలే అవకాశాలు ఉన్నట్టు చర్చ సాగుతోంది. జయలలిత అధికారాల్ని అడ్డం పెట్టుకుని చాప కింద నీరులా ఆ మాఫియా కూడబెట్టిన ఆస్తుల్ని గురిపెట్టి దాడులకు పథకం సాగుతున్నట్టు తెలిసింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో..