వివేక్ కు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం సర్వేనా?

వరంగల్ ఉపఎన్నిక స్థానానికి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను బరిలోకి దించిన సంగతి తెలిసిందే. అయితే రాజయ్యను బరిలో దించడానికి ముందే ఆ స్థానం నుండి పోటీ చేయడానికి మాజీ ఎంపీ వివేక్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణల పేర్లను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసుకున్నారని తెలుసు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించుకున్నా.. ఎక్కువ శాతం మాత్రం వివేక్ నే బరిలో దించాలని సోనియా ప్రయత్నించారు. ఒకవేళ వివేక్ పోటీచేయని పక్షంలో సర్వేను బరిలో దింపుదామనకున్నారు. కానీ వారిద్దరూ కాకుండా కాంగ్రెస్ పార్టీ రాజయ్యను పోటీలోకి దించింది. అయితే వివేక్ బరిలోకి దిగకపోవడానికి అసలు కారణం సర్వే సత్యనారాయణేనట. అతని వల్లే కాంగ్రెస్ పార్టీ వివేక్ కాకుండా రాజయ్యకు టికెట్ ఇచ్చిందట.

మొదట వరంగల్ ఉపఎన్నికకు పోటీచేయడానికి వివేక్ అంతలా సముఖత చూపించలేదు.. అది తెలిసిన విషయమే.. కానీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయమని ఒత్తిడి తీసుకురావడంతో వివేక్ కూడా అందుకు సిద్దపడ్డారంట. కానీ మాదిగలు ఎక్కువగా ఉన్న ఈ స్థానం నుండి వివేక్ ను ఎలా బరిలోకి దింపుతారు అని సర్వే అభ్యంతరం తెలిపారట. అంతేకాదు.. రీసెంట్ గా వివేక్ టీఆర్ఎస్ లో చేరుతారు అన్న వార్తలు వచ్చాయి.. టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావుతో కూడా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లోకి వెళ్లొచ్చిన వివేక్ కు టికెట్ ఎలా ఇస్తారు అని దిగ్విజయ్ కి చెప్పడంతో దిగ్విజయ్ సోనియాకు తెలియజేయడంతో.. సోనియా తప్పక రాజయ్యను బరిలోకి దించాల్సి వచ్చిందట. మొత్తానికి వివేక్ కు టికెట్ ఇవ్వకపోవడం వెనుక సర్వే హస్తం ఉందని తెలిసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu