పెళ్లైన 3 గంటలకే విడాకులు... వెంటనే మరో పెళ్లి...

 

ఈ రోజుల్లో పెళ్లిళ్లు జరగడాలు... భార్య భర్తలు ఇద్దరికీ పడకపోతే విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. అయితే పెళ్లైన మూడు గంటలకే విడాకులు తీసుకున్న విచిత్రమైన ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... జార్ఖండ్‌లోని ఛాంద్వా గ్రామంలో రుబానా అనే యువతికి, అన్సారీకి పెళ్లి నిశ్చయమైంది. ఈనేపథ్యంలోనే పెళ్లి జరుగుతుండగా... పెళ్లయిన వెంటనే త‌న‌కు బైక్ కావాలంటూ పెళ్లికొడుకు అన్సారీ కోరిక‌ కోరాడు. లేదంటే పెళ్లి కూతురును త‌న‌ ఇంటికి తీసుకెళ్లేదిలేద‌ని అన్నాడు. దీంతో పెళ్లికొడుకు తండ్రి చేసేది లేక వెంటనే  హీరో హోండా ఫ్యాషన్‌ బైక్‌ను కొనుగోలుచేసి తీసుకొచ్చి అల్లుడికి ఇచ్చాడు. అయితే, పెళ్లి కొడుకు ఆ బైక్ తీసుకొని సంతోష ప‌డ‌క‌, త‌న‌కు అంతకంటే ఖరీదైన బైక్‌ కావాలని మ‌ళ్లీ డిమాండ్ చేశాడు. దానితో స‌రిపెట్టుకోమ‌ని పెద్దలు ఎంత‌ చెప్పినా వినిపించుకోలేదు. దీంతో తనకి ఈ పెళ్లి కొడుకు వద్దని.. పెళ్లి కూతురు చెప్పేసింది. ఈ క్రమంలో పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు ముస్లిం పెళ్లి పెద్ద ‘కాజా’కు కబురు పెట్టారు. అనంత‌రం పెళ్లి కొడుకు మెడ‌లో చెప్పుల దండ వేశారు. కట్నం కోసం కక్కుర్తిపడ్డాను అని ఓ బోర్డును అత‌డి మెడ‌లో త‌గిలించారు. అనంత‌రం అదే ఊరికి చెందిన మొహమ్మద్‌ ఇలియాస్‌ అనే యువకుడి తల్లిదండ్రులతో మాట్లాడిన పెద్ద‌లు అదే పెళ్లి పందిట్లో ఆ వ‌ధువుకు పెళ్లి చేశారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu