100 ఫోన్ చేస్తే పరీక్షకు తీసుకెళ్తాం
posted on May 7, 2015 6:14PM
.jpg)
ఆర్టీసీ సమ్మె కారణంగా ఆంధ్రప్రదేశ్ లో మే 8 వ తేదీన మెడిసిన్, ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ కోర్సుల్లో ప్రవేశానికి గాను నిర్వహించనున్న ఎంసెట్ పరీక్షకు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. సుమారు 2. 55 లక్షల మంది విద్యార్ధులు ఎంసెట్ పరీక్షకు హాజరవుతున్నారని, పరీక్ష షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదని మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆర్టీసీ బస్సులు 40 శాతమే తిరుగుతున్నాయని దీనికోసం ప్రైవేట్ స్కూల్ బస్సులను స్వాధీనం చేసుకుంటామని గంటా తెలిపారు. మరోవైపు ఎంసెట్ రాయడానికి వెళ్లే విద్యార్ధులకు రవాణా సౌకర్యం లేకపోతే డయల్ 100 కి కాల్ చేస్తే పోలీసు వాహనాల్లో తీసుకెళ్తామని విజయవాడ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇతర ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని కోరారు.