కోడిపుంజును అరెస్ట్ చేసిన పోలీసులు..

 

ఈ మధ్యకాలంలో మనుషులనే కాదు జంతువులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇటీవలే గుజరాత్ లో మనుషులను చంపి తిన్నందుకు సింహాలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కోడిపుంజును అరెస్ట్ చేసి లాకప్‌లో వేశారు. ఈ విచిత్రమైన ఘటన ఖమ్మంలో జరిగింది. ఇంతకీ ఆ కోడిపెట్ట అంత నేరం ఏం చేసిందబ్బా అనుకుంటున్నారా..వివరాల ప్రకారం..ఖమ్మం నగర శివారులో కోడి పందెలు నిర్వహించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని.. ఆ స్థావరంపై దాడి చేశారు. పాపం అక్కడ అందరూ తప్పించుకున్నా ఒక్క కోడిపుంజు మాత్రం పోలీసుల కంటపడింది. అంతే దానిని తీసుకొచ్చి మన పోలీసులు లాకప్‌లో వేసేశారు. మరి దానికి ఏం శిక్ష విధిస్తారో పోలీసులు చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu