రేవంత్ రెడ్డి భార్య నడిపిన రాజకీయం... తెలిస్తే షాకే...!

 

ఈమధ్య తెలంగాణలో ఎక్కువగా వినిపించిన పేరు ఏదైనా ఉంది అంటే అది రేవంత్ రెడ్డి పేరే. ఎప్పుడైతే రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు అని వార్తలు వచ్చాయో.. అప్పటి నుండి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాయి. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ.. రేవంత్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చాడు. పోతూ, పోతూ రేవంత్ తనతో పాటు కొంతమంది కీలక నేతలను కూడా పట్టుకుపోయాడు. ఇది అందరికీ తెలిసిన జనరల్ న్యూస్. కానీ ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడింది. అదేంటంటే..రేవంత్ రెడ్డి భార్య గీత నడిపిన రాజకీయం గురించి. ఇప్పుడిదే తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. టీటీడీపీ సీనియ‌ర్‌ల‌కు కూడా షాక్ ఇచ్చింది. ఆమెలో ఇంత టాలెంట్ ఉందా అని అనుకుంటున్నారు. ఇంతకీ గీత నడిపిన రాజకీయ రాయబారం ఏంటో తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.

 

అదేంటంటే.. రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నప్పుడు ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. కానీ, ఆయ‌న నుంచి మ‌రికొంద‌రు టీటీడీపీ సీనియ‌ర్ నేత‌ల‌కు ఆహ్వానం అందినా వారు స‌సేమిరా అన్నారు. తాము ప‌చ్చ కండువాని వీడేదే లేద‌ని క‌రాఖండిగా తెలిపారు. ముఖ్యంగా వ‌రంగ‌ల్ నేత సీత‌క్క కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. అయితే ఇక్కడే గీత రాజకీయ రాయబారం నడిపారు. రేవంత్ రేపు ఉద‌యం ఢిల్లీకి బ‌య‌ల్దేర‌తార‌న‌గా, రాత్రికి రాత్రి రేవంత్ రెడ్డి భార్య హైద‌రాబాద్ నుంచి భూపాల‌ప‌ల్లి జిల్లాలోని సీత‌క్క ఇంటికి చేరుకున్నార‌ట‌.  కాంగ్రెస్‌లో చేరితే త‌నకు ములుగు నుంచి ఎమ్మెల్యే సీటు ఇప్పించే బాధ్య‌త రేవంత్ తీసుకుంటార‌ని, పొలిటిక‌ల్ కెరీర్‌కి భ‌రోసా ఇచ్చిన‌ట్లు స‌మాచారం.దీంతో, అప్ప‌టిదాకా టీటీడీపీలోనే ఉందామ‌ని భావించిన సీత‌క్క‌.. స‌డెన్‌గా త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుంద‌ట‌.  అంతేకాదు.. ఆవిడే ద‌గ్గ‌రుండి అర్ధ‌రాత్రి హైద‌రాబాద్‌కి తీసుకువ‌చ్చి త‌ర్వాత రోజు మార్నింగ్ ఫ్ల‌యిట్ ఎక్కించినట్లు స‌మాచారం. ఈ విష‌యం టీటీడీపీ సీనియ‌ర్‌ల‌కు కూడా తెలియ‌ద‌ట‌. అప్పటివరకూ టీడీపీని వీడనని చెప్పిన సీతక్క సడెన్ గా ఢిల్లీలో ప్రత్యక్షమవడంతో టీడీపీ నేతలు షాక్ కు గురయ్యారట. మొత్తానికి రేవంత్ రెడ్డికి ఉన్న రాజకీయ తెలివితేటలు గీత కూడా నేర్చుకున్నట్టు ఉంది. తనలో ఉన్న టాలెంట్ ను ఒక్కసారిగా బయటపెడింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu