టీఆర్ఎస్ పై మండిపడ్డ రేవంత్ రెడ్డి..

టీడీఎల్పీనేత రేవంత్ రెడ్డి అదికార పార్టీ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. గతంలో ఎప్పుడూ ముందు వరుసలో కూర్చునే రేవంత్ రెడ్డి.. ఇప్పుడు నాలుగో వరసలో కూర్చోవాల్సి వచ్చింది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ..  సభలో విపక్ష నేతగా తనకు ముందు వరుసలో సీటు కేటాయించాల్సి ఉన్నా, అందుకు విరుద్ధంగా నాలుగో వరుసలో కేటాయించారని మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే తనపై కక్ష్య సాధిస్తుందని.. మాకూ మంచి రోజులు వస్తాయి అని వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ టీడీపీ నుండి మొత్తం 15 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటి వరకూ 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఇంక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu