రేవంత్ రెడ్డి మౌనం.. ఎందుకో?
posted on Nov 7, 2015 9:44AM

రేవంత్ రెడ్డి.. తెలంగాణ టీడీపీ నేతల్లో.. ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పగల, వాక్చాతుర్యం ఉన్న ఏకైక వ్యక్తి. విపక్షాలు చేసే విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పగల సత్తా ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డే. అందుకే టీడీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు అసలు డౌట్ ఏంటంటే.. ఎక్కడ సందు దొరుకుతుందా.. ప్రతిపక్షాలను తన మాటలతో ఎప్పుడు ఏకీ పారేద్దామా అని చూసే రేవంత్ రెడ్డి ప్రస్తుతం సైలెంట్ గా ఉండటం. అసలు ఈ సైలెంట్ కు కారణం ఏంటి.. అంటే సైలెంట్ ఉంటూ భవిష్యత్ కార్యచరణలకి వ్యూహాలు పన్నుతున్నారు.. లేకపోతే తుఫాను వచ్చే ముందు ఇలాగే సైలెంట్ గా ఉంటుందని చూపెడుతున్నారా? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు ఇప్పటికే అవరావతి శంకుస్థాపన కార్యక్రమం వల్ల నిప్పు, ఉప్పులా ఉండే సీఎంలు కాస్త స్నేహ బంధానికి దారి తీశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కూడా ఏం అనలేని పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అంతేకాదు టీడీబీ-బీజేపీ నాయకులు జీహెచ్ఎంసీ ఓట్ల తొలగింపుపై చేసిన ధర్నాలో కూడా రేవంత్ రెడ్డి ఎక్కడా కనిపించలేదు. ఏది ఏమైనా టీడీపీ కంచు అయిన రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉండటం వెనుక అసలు కారణం ఏంటో?