ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి పితృవియోగం
posted on Jul 8, 2025 9:46AM

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తండ్రి శివశక్తిదత్తా సోమవారం (జులై 7) రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. సై, ఛత్రపతి, బాహుబలి, రాజన్న, ఆర్ఆర్ఆర్ సినిమాలకు శివశక్తి దత్తా పాటలు రాశారు. కొన్ని సినిమాలకు స్క్రీన్ రైటర్ గా పని చేశారు.
అలాగే జానకిరాముడు చిత్రానికి శివశక్తి దత్తా రచయతగా పని చేశారు. ఇక చంద్రహాస్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు రాజమౌలి తండ్రి విజయేంద్ర ప్రసాద్, శివశక్తి దత్తా స్వయానా సోదరులు. శివశక్తి దత్తా మృతితో కీరవాణి, రాజమౌలి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. శివశక్తిదత్తా మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.