జాని మాస్టర్ కు ఊరట 

 కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ కు ఊరట లభించింది. రంగారెడ్డి జిల్లా కోర్టు ఆయనకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది.  ఈ నెల ఆరు నుంచి 10 వతేదీ వరకు మాత్రమే బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్టపై అత్యాచారం చేసినట్లు జానీ మాస్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నార్సింగ్ పోలీసులు జానిమాస్టర్ పై రేప్, బ్లాక్ మెయిల్ తదితర కేసులు  నమోదు చేసి  రిమాండ్ కోసం చెంచల్ గూడ జైలుకు పంపారు.  జానిమాస్టర్ కు ఇటీవల జాతీయ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఈ అవార్డు తీసుకోవడానికి జానిమాస్టర్ కు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అవార్డు తీసుకోవడానికి మాత్రమే బెయిల్ ఇవ్వనున్నట్టు కోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చింది. సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu