క‌రీంన‌గ‌ర్ లో క‌రోనా ఎంట్రీకి  పారాసిటమాలే కార‌ణ‌మ‌ట‌! 

తెలుగుభాష రాక‌పోయిన ఇండోనేషియా మత ప్రబోధకులకు రెండు తెలుగురాష్ట్రాల ముఖ్య‌మంత్రులు చేసిన పారాసిట‌మాల్ పాఠం బాగా అర్థంమైవుంటుంది. అందుకే వారు పారాసిట‌మాల్ వేసుకొని ఎవ‌రికీ దొర‌క‌కుండా నేరుగా క‌రీంన‌గ‌ర్ లో వాలిపోయారు. ప్రశాంతంగా ఉండే కరీంనగర్ లో ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రబోధకులు కరోనాను వ్యాపింప చేసి అల్లకల్లోలం సృష్టించారు.

అయితే తమకు వ్యాధి లక్షణాలున్నా వాటిని గుట్టుగా ఉంచి ఇండోనేషియన్లు మోసం చేశారని అధికారులు గుర్తించారు. కరీంనగర్ కు వచ్చిన ఇండోనేషియా వాసులకు అంతకు ముందే జ్వరం దగ్గుతో బాధపడుతున్నారట.. జ్వరానికి వాడే పారాసిటమాల్ తో దీన్ని మేనేజ్ చేశారని విచార‌ణ‌లో తేలింది.

తమకు ఆరోగ్యం బాగా లేదని ఎయిర్ పోర్టులో గుర్తిస్తే అక్కడే ఆపేస్తారని.. ఆస్పత్రికి తరలిస్తారని వాళ్లు అనుకొని పారాసిటమాల్ ట్యాబెట్లు వేసుకొని అక్కడ చెకప్ నుంచి తప్పించుకొని తెలంగాణలో ప్రవేశించారన్న నిజం బయటపడింది.

పోలీసులు వీరిని విచారించే క్రమంలో వీరు పారాసిటమాల్ ట్యాబెట్లతో మాయ చేసిన వైనం వెలుగుచూసింది. మరి వీరికి కరోనా పాజిటివ్ తేలడంతో వీరు ఎంతమందికి అంటించారు.? ఎన్ని కరోనా పాజిటవ్ కేసులు తేలుతాయనేది మరికొద్దిరోజుల్లోనే తేలనుంది.

ఇప్పుడు అక్కడ కర్ఫ్యూ రెడ్ జోన్ ప్రకటించి ఇళ్ల నుంచి బయటకు రాకుండా అధికారులు కఠిన ఆంక్షలు పెట్టారు. ఇదివరకే వీరితో కలిసి తిరిగిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంకా వందలాది మందితో వీధుల్లో వీరు తిరిగారు.. కలిశారు. ప్రార్థనలు చేశారు. కనీసం 300 మందితో వీరు సన్నిహితంగా మెలిగారట.. ఇప్పుడు మరో పదిరోజుల్లో మరెంతమందికి కరోనా వ్యాధి తేలుతుందనే ఆందోళన కరీంనగర్ వాసుల్లో భయాందోళనకు గురిచేస్తోంది.