చెన్నై వర్షంపై దేవుడు, సెలబ్రిటీల మీద వర్మ కామెంట్లు..

వివాదాస్పద వ్యాఖ్యల బ్రాండ్ అంబాసిడర్ రాంగోపాల్ వర్మ ఇప్పుడు చెన్నె వర్షాల మీద కూడా తన దైన శైలిలో విమర్శలు చేశారు. గత వందేళ్లలో ఎప్పుడూ చూడని విధంగా చెన్నెని వర్షపాతం కమ్ముకుంది. వరద నీటితో చెన్నై మొత్తం మునిగిపోయింది. దీంతో కష్టాల్లో ఉన్న చెన్నె వాసులకు ఎవరికి తోచిన విధంగా వారు ఏదో ఒక రకంగా సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అలాంటి వారిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు దేవుడి పై కూడా విమర్శలు చేశాడు. చెన్నైలో వర్షాలు కురిసేది దేవుడి వల్లే అని.. అలాంటి దేవుడిని విమర్శిచాలి అంతే కాని.. ప్రార్ధించకూడదు అని అన్నాడు. అంతేకాదు చెన్నై ప్రజలను చూసి చాలా బాధపడుతున్నాను.. అదేవిధంగా దేవుడి మీద కోపంగా కూడా ఉన్నాను అని ట్వీటాడు.

అంతేకాదు చెన్నె వాసులకు సెలబ్రిటీలు విరాళాలు ఇవ్వగా దానిని ఉద్దేశించి.. కోట్లు కోట్లు కూడబెట్టిన సూపర్ స్టార్లు.. లక్షలు దానం చేసి బిచ్చమేశారని.. అంతకంటే వారు ఇవ్వకపోయినా బాగుండేదని అన్నారు. వారు ఇచ్చిన డబ్బుతో చెన్నైవాసులకు ఏం చేయాలో అర్ధంకావడం లేదని విమర్శించాడు.. ఇక దానం చేసే విషయంలో పనిలో పనిగా తన గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు రాంగోపాల్ వర్మ.. నేనెప్పుడూ ఒక్క రూపాయి కూడా దానం చేయలేదు. నేను చాలా స్వార్థపరుడిని అని సెలబ్రిటీలలా క్వింటాళ్ల కొద్దీ ప్రార్థనలు, టన్నులకొద్దీ ప్రేమ కురిపించలేను అని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu