ఫిర్యాదుకు ముందే న్యాయవాదికి సారిక ఈ-మెయిల్

కాంగ్రెస్ పార్టీనేత రాజయ్య కోడలు సారిక మృతి అనంతరం పలు ఆసక్తికరమైన అంశాలు బయటపడుతున్నాయి. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అని పలు అనుమానాలు రేకెత్తున్న తరుణంలో ఇప్పుడు ఇంకా కొన్ని ట్విస్ట్ లు బయటపడుతున్నాయి. ఇప్పటికే మత్తుమందు ఇచ్చి సారికపై పెట్రోల్ పోసి కాల్చేశారా? అంటూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీనిలో భాగంగానే రాజయ్య ఇంటిలోని ఆహార పదార్ధాలను సీజ్ చేశారు.

అయితే సారిక గతంలో రాజయ్య కుటుంబంపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఫిర్యాదుకు ముందే సారిక తన కష్టాల గురించి రెహానా అనే న్యాయవాదికి ఈ మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. ఇంట్లో నుండి వెళ్లి పోవాలని పదే పదే అత్త, భర్త వేధించేవారని.. శారీరక, మానసిక చాలా బాధించేవారని పేర్కొంది. అరుపులు, కేకలు, తిట్లతోనే అత్త రోజంతా ఉండేదని.. నన్ను ఎప్పుడు పంపిద్దామా అన్నదే వారి ఆలోచన అని.. రాజయ్య ఎంపీ అయ్యాక వేధింపులు మరీ ఎక్కువయ్యాయని సారిక ఈ మెయిల్ లో తెలిపింది. అంతేకాదు తన భర్త వివాహేతర సంబంధాల గురించి కూడా ప్రస్తావించింది సారిక. తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని.. ఎప్పుడు ఇంటికి వస్తాడో.. ఎప్పుడు వెళ్తాడో కూడా తెలియదని.. కనీసం తనని, తన పిల్లల్ని పట్టించుకునేవాడు కాదని చెప్పింది.

ఇదిలా ఉండగా సారిక ఈ మెయిల్ చేసిన న్యాయవాది రెహానా సారిక మృతిపై స్పందిస్తూ సారికది ఆత్మహత్య కాదని హత్య అని ఆరోపిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu