మాజీ ఎమ్మెల్యే ఇంట్లో మారణాయుధాలు

 

గ్యాంగ్ స్టర్ నీరజ్ భవానా ఉత్తరాఖండ్ పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో దొంగిలించిన ఏకే 47 తో పాటు ఎస్ఎల్ఆర్ రైఫిల్ ఆయుధాలు ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో దొరికాయి. గ్యాంగ్ స్టర్ నీరజ్ భవానా స్వయానా ఢిల్లీ మాజీ ఎమ్యెల్యే రమ్ బీర్ షోకిన్ కు మేనల్లుడు. అతను దొంగిలించిన ఆయుధాలు రమ్ బీర్ ఇంట్లో దాచి పెట్టాడు. నీరజ్ భవానా కదలికలపై నిఘా పెట్టిన ఉత్తరఖండ్ పోలీసులు రమ్ బీర్ ఇంటిని సోదా చేయగా ఆయుధాలు బయటపడ్డాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని, నీరజ్ ను అదుపులోకి తీసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu