పదవీ విరమణ తరువాత ప్రణబ్ పొందే ప్రయోజనాలు ఇవే...

 

రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పదవీకాలం ముగిసిన తరువాత కూడా ఆయనకు గౌరవానికి ఎక్కడా భంగం వాటిల్లకుండా ఆయనకు అన్ని సేవలు, సదుపాయాలు కొనసాగిస్తుంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి పదవీ విరమణ తర్వాత కూడా అదే గౌరవం పొందేలా చూస్తున్నారు. రాష్ట్రపతి పొందే ప్రయోజనాలు ఏంటో చూద్దాం...

* పదవీ విరమణ తరువాత నెలకు రూ.75వేల పింఛన్ లభిస్తుంది.
*ఉచిత బంగ్లా
* ఒక ప్రైవేటు సెక్రటరీతో పాటు, ఐదుగురు వ్యక్తిగత సిబ్బంది
* ఒక అధికార కారు, సిబ్బంది ఖర్చులకు ఏటా రూ.60 వేలు
* ఉచితంగా ఒక మొబైల్ ఫోన్, రెండు ల్యాండ్ లైన్ ఫోన్లు..
*రైలు, విమానం ప్రయాణంలో ఉచిత ప్రయాణం