నేతలందు ప్రధాని మోడీ వేరయా..

 

నేతలందు ప్రధాని మోడీ వేరయా.. రాజకీయాల్లో మోడీ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోవర్లు సినీ ప్రముఖులకు కూడా ఉండరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా మంది మోడీ జపం చేస్తున్నారు అంటే ఆయనకు ఉన్న ప్రత్యేకతే దానికి కారణం. అయితే తాజాగా మరోసారి అది రుజువు చేశారు మోడీ జీ.

 

చాలామంది రాజకీయ నేతలు తమ కింద స్థాయిలో ఉన్న అధికారులతో పనులు చేయించుకుంటూ బుక్కయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొంత మంది చెప్పులు తీస్తుంటారు.. కొంతమంది చెప్పులు పట్టుకొని నడుస్తుంటారు.. ఇలా రకరకాల పనులు చేయించుకుంటారు. వాళ్లు చేస్తున్నప్పుడు వద్దని వారించరు.. ఇక అది ఏ కెమెరా కంటో చిక్కి వార్తలు వచ్చినప్పుడు మాత్రం అప్పుడు కావాలని చేయలేదు.. అదీ ఇదీ అని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలా ఎంతోమంది మంత్రులు, ప్ర‌భుత్వాధికారులు త‌మ బూట్ల‌ను స‌హాయ‌కుల‌తో విప్పించుకునిఅయితే విమర్శలపాలయ్యారు. మోడీ మాత్రం అలా అనే ఛాన్స్ ఎవరికీ ఇవ్వకుండా ముందుగానే జాగ్రత్తపడ్డారు.  మోదీ ఈ రోజు ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆల‌యంలో రుద్రాభిషేకం చేయించ‌డానికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, మోదీ మందిరంలోకి వెళ్ల‌డానికి బూట్లు విప్పుతుండ‌గా ఓ వ్య‌క్తి ఆయ‌న‌కు సాయం చేయ‌డానికి వ‌చ్చి, బూట్లు విప్ప‌డానికి య‌త్నించాడు. మోదీ మాత్రం ఆ వ్య‌క్తితో అలా చేయ‌వ‌ద్ద‌ని చెప్పారు. దీంతో మోడీ చేసిన దానికి పలువురు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మోడీ అందరికీ ఆదర్శంగా నిలిచారని అంటున్నారు. అంతేకాదు 28 ఏళ్ల‌లో కేదార్‌నాథ్‌లో రుద్రాభిషేకం జ‌రిపించిన తొలి ప్ర‌ధానిగా కూడా మోదీ నిలిచారు. మొత్తానికి ఈ ఘటనతో రాజకీయ నాయకులందు మోడీ వేరయా అని మరోసారి నిరూపించారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu