దేశంలో లాక్ డౌన్! క్లారిటీ ఇచ్చిన ప్రధాని మోడీ..

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతున్నాయి. తాజాగా.. గడిచిన 24 గంటల్లో 3,86,452 కొత్త కేసులు నమోదయ్యాయి. 3,498 మంది కరోనాతో మరణించారు. దేశంలో 31,70,228 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.కరోనా పంజా ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే తీవ్రత ఎక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పెడతారనే ప్రచారం జరుగుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో లాక్ డౌన్ పెట్టాలని కేంద్ర ఆలోచిస్తుందని అంటున్నారు.

దేశంలో లాక్ డౌన్ పెట్టబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ప్రధాని నరేంద్ర మోడీ క్లారిటీ ఇచ్చారు. కరోనాపై  కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. దేశంలోని కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ కార్యక్రమం, చర్యలపై చర్చించారు. కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో వర్చుపల్ పద్దతిలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని ప్రధాని మోడీ తేల్చిచెప్పారు. కరోనా కేసుల ఆధారంగా లాక్‌డౌన్‌పై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని  తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించి కఠిన ఆంక్షలు అమలు చేయాలని, టెస్టుల సంఖ్యను పెంచాలని మోడీ సూచించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu