ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం

 

భారత ప్రధాని మోదీ ప్రస్తుతం సైప్రస్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారమైన 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3'ను ప్రధాని మోదీ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును మోదీకి అందజేశారు. ఈ గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిందని, ఇది ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక సంబంధాలకు, సోదరభావానికి, వసుధైక కుటుంబం అనే భావనకు నిదర్శనమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

ఈ పురస్కారాన్ని అందుకున్న అనంతరం ప్రధాని  మాట్లాడుతూ, సైప్రస్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును భారత్-సైప్రస్ దేశాల మధ్య ఉన్న చిరకాల స్నేహానికి అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ గుర్తింపు ఇరు దేశాల శాంతి, భద్రతలు, సార్వభౌమాధికారం, ప్రాంతీయ సమగ్రత, శ్రేయస్సు వంటి అంశాలపై పరస్పర నిబద్ధతను మరింతగా పటిష్టం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా జూన్ 16న  సైప్రస్ చేరుకున్న ప్రధానికి నికోస్ క్రిస్టోడౌలిడెస్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు. సైప్రస్ పర్యటన అనంతరం కెనడాకు మోదీ పయనమవుతారు. అక్కడ జరుగనున్న జీ-7 సదస్సులో పాల్గొంటారు. చివరిగా క్రొయేషియాలో అధికారిక పర్యటన జరుపుతారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu