ఏపీలో మరిన్ని పెప్సీకో ప్లాంట్ లు
posted on Apr 3, 2015 1:04PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పెప్సికో చైర్మన్ అండ్ సీఈవో ఇంద్రనూయి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రనూయి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టుకోవడానికి చాలా అనుకూలమైన ప్రాంతం అని, ఇక్కడ పెప్సీ ప్లాంట్ పెట్టడం తమకు చాలా ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు. శ్రీసిటీ ప్లాంట్ ను ప్రారంభించేముందు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రతిపనీ విజయవంతం అవుతుందని, రాష్ట్రంలో మరిన్ని ప్లాంట్ లు పెట్టే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నాయుడు తో పాటు తాము కూడా కృషి చేస్తామని చెప్పారు. శ్రీసిటీలోని 11 యూనిట్లకు చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు.