బీజేపీ చేతికి తెలంగాణాలో పాపులర్ ఛానెల్, పేపర్ !

 

ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు నేతలకు బీజేపీ గాలం వేస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ కోట అని ఫీలవుతున్న తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో బీజేపీ జోష్‌లో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఎలాగైనా బలపడాలని అధికారంలోకి రావాలని కాషాయ దళం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ ఎంపీ గడ్డం వివేక్‌ను పార్టీలోకి ఆహ్వానించింది. 

గత లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన ఆయన కూడా బీజేపీలో చేరడానికి పచ్చ జెండా ఊపారట. ఈరోజు బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. వివేక్‌తోపాటు ఆయన సోదరుడు, మాజీ మంత్రి వినోద్ కూడా బీజేపీలో చేరతారని సమాచారం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసిన వివేక్ అనూహ్యంగా బాల్క సుమన్ చేతిలో ఓడారు. 

అనంతర పరిణామాల్లో గులాబీ తీర్ధం పుచ్చుకున్న ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు కేసీఆర్. అయితే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుమన్‌ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పెద్దపల్లి టికెట్‌ తనదేనని వివేక్ భావించారు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి బాల్క సుమన్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకటేశ్ నేత పోటీ చేసి ఆ తర్వాత టీఅయేఎస్ లో చేరిన వెంకటేష్ కి టికట్ ఇచ్చారు. 

ఆయన అలా ఇవ్వడానికి కారణం సామాజిక వర్గమే అయినా అప్పటి నుండి వివేక్ ఆ పార్టీకి దూరం అయ్యారు.  అలా కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న వివేక్, వినోద్ సోదరులు టీఆర్ఎస్‌ కి కాంగ్రెస్ కంటే కూడా బీజేపీయే సరైన ప్రత్యామ్నయం అని భావించారని అందుకే ఆహ్వానం రాగానే వీరు కాషయ కండువా కప్పుకునేందుకు సిద్దమయినట్టు చేబుతున్నరు. వివేక్ బీజేపీలో చేరితే వినోద్ కంటే భాజ‌పాకే ఎక్కువ లాభం ఉంది. 

ఎందుకంటే తెలంగాణ‌లో భాజ‌పాకి సొంత మీడియా అంటూ ఇంత‌వ‌ర‌కూ ఏదీ లేదు. అధికార పార్టీకి కొన్ని మీడియా సంస్థ‌లు తమ సహాకారం అందిస్తుండగా, టీవీ 9 మాజీ సీఈవో పెట్టె కొత్త ఛానల్ బీజేపీకి సపోర్ట్ గా ఉంటుందని అనుకున్నారు. దానితో పాటు ఇప్పుడు వినోద్ రాక‌తో ఒక న్యూస్ ఛానెల్‌, ఒక ప‌త్రిక భాజ‌పాకి అండ‌గా నిలిస్తుందని చెప్పచ్చు. అండగా నిలుస్తుంది అనడం కంటే కూడా బీజేపీ చేతికి తెలంగాణాలో పాపులర్ ఛానెల్ అయిన వీ6 ఛానెల్‌తోపాటు వెలుగు పత్రిక దొరికినట్టే. ఎందుకంటే వీటిని రన్ చేసేది వివేక్ కుటుంబీకులే. ఒకప్పుడు టీఆర్ఎస్ కి మద్దతుగా వార్తలు ప్రచురించిన ఈ రెండూ ఆ తర్వత న్యూట్రల్ గా ఉంటూ వచ్చింది. తాజాగా పరిణామాలతో ఆ రెండూ ఇప్పుడు బీజేపీకి బాకా ఊదనున్నాయన్నమాట !