పవన్, కిరణ్ లది ఒకటే పార్టీ?

 

 

 

రాజమండ్రి సభలో తాజా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీ పేరును జై సమైక్యాంధ్రగా ప్రకటించారు. నోవాటెల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ నామకరణోత్సవం నిర్వహించారు. జనసేన పేరును అధికారికంగా ప్రకటించారు. కొత్తగా పెట్టిన ఈ రెండు పార్టీల పేర్లు ఇంగ్లీష్ షార్ట్ ఫార్మ్ లో జై సమైక్యాంధ్ర పార్టీ (jsp), జనసేన పార్టీ (jsp) లుగా ఉచ్చరించాల్సినవే. తెలుగు పొట్టి పేర్లలో జైసపా, జైసేపా లుగా స్థిరపడి చిన్న తేడా రెండింటి మధ్య కనిపిస్తుంది.


పేరులోనే కాకుండా తీరులోనూ ఈ రెండు పార్టీలకు చాలా పోలికలున్నాయి. కాంగ్రెస్ డిల్లీ పెద్దలపై ఆగ్రహంతోనూ, విభజన తీరును వ్యతిరేకిస్తూ  కిరణ్, పవన్ లు కొత్త పార్టీలను పెట్టారు. తాము తెలంగాణాకు వ్యతిరేకం కాదంటూనే సీమాంధ్ర హక్కులు గురించి ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు, మార్చి నెలలోనే రెండు పార్టీలు ఆవిర్భవించాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి)ని కిరణ్కుమార్ రెడ్డితో పాటు పవన్ కళ్యాణ్ కూడా అభిమానించడం కొసమెరుపు.