ట్వీట్లు వేస్తే సరిపోదు.. వెళ్లి కాపాడు

 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరోసారి పవన్ కళ్యాణ్ కు కొన్ని సూచనలు చేశారు. గతంలో కూడా ఈయన ఒకసారి ఓటుకు నోటు వ్యవహారంపై ప్రశ్నిస్తా అన్నావు కదా ఏం చేస్తున్నావ్ అంటూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ రాజధానిలో భూముల సేకరణను ఉద్దేశించి వీహెచ్ పవన్ కళ్యాణ్ ను సూచించారు. భూసేకరణ వద్దంటూ ట్వీట్టర్ లో ట్వీట్లు చేస్తూ ఇంట్లో కూర్చుంటే సరికాదు.. అక్కడికి వెళ్లి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఏపీ ప్రభుత్వం అన్యాయంగా రైతుల నుండి భూములను లాక్కుంటుందని.. పవన్ కళ్యాణ్ రాజధాని వెళ్లి ఆపాలని సూచించారు.

కాగా రైతుల నుండి పంటలు పండే భూములు తీసుకోవద్దని.. ఉండవల్లి, బేతపూడి, పెనుబాక గ్రామాల్లో ఉన్న భూములను భూసేకరణ నుండి మినహాయించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ట్వీట్టర్ ద్వారా చంద్రబాబును కోరిన సంగతి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu